నీ మాట వింటే రాదా మైమరపే నీ పేరు అంటే రాదా మైమరపే నేను ఎవరో ఎవరో తెలిసింది నీ వల్లా నువ్వు లేను నేను ఖాళీ కాదులే కల్లా
నీ కలలే మదిలో మెదులు నీ వలనే సరదా మొదలు నీ మాట వింటే రాదా మైమరపే నీ పేరు అంటే రాదా మైమరపే
నా ప్రపంచం హేలి అనే నాకు అసలేమౌతోందో చుట్టూ తెలియదుగా నా చిరాకే ఉంది పరారీలో తెగ సంబరపడుతూ ఉంటా నువ్వే కనబడగా కదలనుగా మెదలనుగా వదలనుగా
ఎక్కడిదే ఈ వెలుగంతా నా కళ్ళలో నీలాలలా మెరిసే నీ నవ్వులందే ఎప్పటికీ నను బతికించే ఊపిరివే గాలాడదే క్షణమైనా నువ్వు లేనిదే
నువ్వొచ్చాకనే కదా జీవితం అంటే తెలిసింది అవస్థ ఉన్నా సరే నా పనికి బాధ్యత పెరిగింది నువ్వు లేవా… నేనసలు ఏమైపోతానో జీవితము ఏమౌనో ఎపుడైతే నీతో ఉంటానో సందడిగా ఉంటానే
నిజము తెలుపనా లేదుగా మనసు మనసులా జతపడు అడుగు అడుగునా కుదురుగా మనసు నిలవదా